గంగాధర నెల్లూరు: ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ జాతీయ అధ్యక్షులు గా అర్థాల కేశవులు గారిని నియమించినట్లు ఫౌండర్ బండి పట్టాభి రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సంస్థ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేయాలని కోరారు. ఈ సంస్థ ఆర్టీఐ ఎ ఎస్ సంస్థ కు అనుబంధ సంస్థ గా పనిచేస్తుందని ఫౌండర్ తెలిపారు. ఈ నియామకం పట్ల హ్యూమన్ రైట్స్ సభ్యులు,ఆర్టీఐ ఎ ఎస్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశం లో నూతన జాతీయ అధ్యక్షులు మాట్లాడుతూ అందరినీ కలుపుకొని సంస్థను అభివృద్ధి పథం లో నడిపించుతాననిసబా ముఖంగా తెలియజేసారు. ఈ పదవి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలియజేసారు.
0 Comments