రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా రెడ్డి జ్యోతి.


తిరుపతి:ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి జ్యోతి ని నియమించినట్లు జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు తెలిపారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రెడ్డి జ్యోతి మాట్లాడుతూ ముఖ్యంగా స్త్రీల తరుపున పోరాడుతానని,సంస్థ నియమ నిబంధనలు పాటించి, సంస్థ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. ఈ నియామకం పట్ల పలువురు హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు, జాతీయ గౌరవ అధ్యక్షులు జ్యోతి ప్రకాష్, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ బండి పట్టాభి రెడ్డి, ఆర్టీఐ ఎ ఎస్ సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి గొడుగుచింత కిరణ్,జాతీయ మహిళా అధ్యక్షురాలుశ్రీమతి అర్థాల ధన్యవాణి పాల్గొన్నారు.

Post a Comment

0 Comments