తిరుపతి: ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర లీగల్ సెల్ మహిళా ఉపాదక్ష్యురాలిగా K. విద్యా శ్రీ MBA ;LLB; నీ నియమించినట్లు జాతీయ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి అర్థాల ధన్య వాణి ఓ ప్రకటనలో తెలిపారు.నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన విద్యా శ్రీ మాట్లాడుతూ ముఖ్యంగా స్త్రీలకు లీగల్ అండ దండ లు ఉంటాయని, ఎవరికైనా లీగల్ సమస్యలు ఉన్నవారు నన్ను సంప్రదించండి మీకు తగు న్యాయం చేస్తానని వాగ్ధానం చేసారు.సంస్థ కు సంబంధించిన విషయాలకు స్పందించుతానని తెలిపారు. ఈ నియామకం పట్ల పలువురు హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమం లో జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు, జాతీయ గౌరవ అధ్యక్షులు K. జ్యోతి ప్రకాష్,జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ G. మోహన్ కుమార్, జిల్లా అధ్యక్షులు మరియు సభ్యులు పాల్గొన్నారు.
0 Comments