తిరుపతి: ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ జాతీయ ఉపాధ్యక్షులుగా డాక్టరేట్ ఉమామహేశ్వర రావు నీ నియమించినట్లు జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు తెలిపారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ సామాన్య ప్రజలకు మానవ హక్కుల పై అవగాహన సదస్సులు నిర్వహించడం,అన్యాయం జరిగినవారికి న్యాయం చేయడం,సమాజ సేవ చేస్తానని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా,రాజమండ్రి కిచెంది ఈయన బ్రహ్మర్షి, డాక్టరేట్ కావున సంస్థ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారని జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు తెలిపారు. ఈ నియామకం పట్ల హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమానికి జాతీయ గౌరవ అధ్యక్షులు కె.జ్యోతి ప్రకాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ జి.మోహన్ కుమార్, జాతీయ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి ధన్య వాణి,మరియు సభ్యులు పాల్గొన్నారు.
0 Comments