తిరుపతి:ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ శ్రీకాకుళం జిల్లా జనరల్ వింగ్ ప్రెసిడెంట్ గా చౌదరి రవీంద్ర B.Com గారిని నియమించినట్లు జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు తెలిపారు. నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన చౌదరి రవీంద్ర మాట్లాడుతూ వెనుక బడిన శ్రీకాకుళం జిల్లా ను అభివృద్ధి పథకంలో నడిపించ గలనని,మరియు సమస్యలు ఉన్న ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పారు. ఈ నియామకం పట్ల పలువురు హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమం లో జాతీయ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి అర్థాల ధన్య వాణి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు G. బిందు ప్రియ, జిల్లా అధ్యక్షులు మరియు సభ్యులు పాల్గొన్నారు.
0 Comments