RTI AS సంస్థ సౌత్ జోన్(ఇండియా) అధ్యక్షులుగా A.కృష్ణ.తిరుపతి.


గంగాధర నెల్లూరు :RTI AS సంస్థ దక్షణ భారత దేశ విభాగపు అధ్యక్షులుగా(సౌత్ జోన్) A. కృష్ణ గారిని నియమించినట్లు జాతీయ అధ్యక్షులు బండి పట్టాభి రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సౌత్ జోన్ అధ్యక్షులు మాట్లాడుతూ సంస్థను ఈ ఐదు రాష్ట్రాలలో బలోపేతం చేస్తానని,సామాన్య ప్రజలకు సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించి,ప్రజలను చైతన్య వంతులను చేస్తానని తెలిపారు. ఈ నియామకం పట్ల పలువురు ఆర్టీఐ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమం లో జాతీయ ఉపాధ్యక్షులు మోహన కుమార్, జాతీయ డైరెక్టర్ ఆవుల సుబ్రమణ్యం,బండి పరమేశ్వర రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు ఆవిలాల రఘు,జిల్లా అధ్యక్షులు మోహన మురళీ,పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశం జాతీయ ముఖ్య కార్యనిర్వహణాధికారి( CEO) K. జ్యోతి ప్రకాష్ ఆధ్వర్యం లో జరిగినది.

Post a Comment

0 Comments