తిరుపతి: ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ తిరుపతి జిల్లా మహిళా కన్వీనర్ గా కావలి రేఖ గారిని నియమించినట్లు జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు తెలిపారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రేఖ గారు మాట్లాడుతూ సమాజంలో స్త్రీల అభ్యున్నతికి కృషి చేస్తానని,అన్యాయాలను జరగకుండా చూస్తామని తెలిపారు. ఈ నియామకం పట్ల హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు మరియు ఆర్టీఐ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఫౌండర్ బండి పట్టాభి రెడ్డి, గౌరవ అధ్యక్షులు జ్యోతి ప్రకాష్, గౌరవ సలహా దారులు మోహన్ కుమార్, ఆర్టీఐ ఎ ఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ D K.కుమార్, ఆర్టీఐ ఎ ఎస్ సంస్థ జాతీయ డైరెక్టర్ తిరుమల సుబ్రమణ్యం పాల్గొన్నారు.

0 Comments