తిరుపతి:ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ శ్రీమతి జ్యోతి గారిని తిరుపతి జిల్లా మహిళా ఉపాధ్యక్షులు గా నియమించి నట్లు అధ్యక్షులు కేశవులు తెలిపారు.నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీమతి జ్యోతి గారు మాట్లాడుతూ మహిళా అభివృద్ధికి, సమస్యలపై అవగాహన కల్పించడం లో ముందు ఉంటానని తెలిపారు. ఈ నియామకం పట్ల హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో జాతీయ సలహా దారులు మోహన్ కుమార్ పాల్గొన్నారు.

0 Comments