POHRF సంస్థ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా G. మోహన్ కుమార్.


తిరుపతి: ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా G. మోహన్ కుమార్ నీ నియమించినట్లు ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ బండి పట్టాభి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ G. మోహన్ కుమార్ మాట్లాడుతూ సంఘం లో జరుగుతున్న పరిణామాల పై స్పందించి POHRF సంస్థకు రావడంజరిగింది అన్నారు.తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు,కాగా మోహన్ కుమార్ ఆర్టీఐ ఎ ఎస్ సంస్థ లో జాతీయ ఉపాధ్యక్షులు గా కొనసాగుతున్నారు.ప్రజలకూసేవచేయాలని సంస్థ లోచేరారన్నారు.ఈ నియామకం పట్ల పలువురు హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సభ్యులు,ఆర్టీఐ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు,జాతీయ గౌరవ అధ్యక్షులు K. జ్యోతి ప్రకాష్, జాతీయ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి ధన్య వాణి,పలువురు సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments