తిరుపతి: ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా P. వెంకట రమణయ్య ను నియమించినట్లు జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు తెలిపారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జిల్లా అధ్యక్షులు వెంకట రమణయ్య మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని,POHRF కు మంచి పేరు తీసుకు వస్తానని తెలిపారు. ఈ నియామకం పట్ల హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమం లో జాతీయ అధ్యక్షులు తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.
0 Comments