POHRF జాతీయ లీగల్ సెల్ అధ్యక్షులు గా B . నాగేశ్వర్ రెడ్డి.


తిరుపతి: ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ జాతీయ లీగల్ సెల్ అధ్యక్షులు గా B.నాగేశ్వర రెడ్డి నీ నియమించినట్లు జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు ఓ ప్రకటనలో తెలిపారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జాతీయ లీగల్ సెల్ అధ్యక్షులు నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ సంస్థ లో సభ్యులకు, ప్రజలకు లీగల్ ఇష్యూ లు ఉంటే నేను ముందుండి పరిష్కార మార్గాలు చూపుతానని,కోర్టు లో పిటిషన్ వేయాలన్న నన్ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాతీయ గౌరవ అధ్యక్షులు జ్యోతి ప్రకాష్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ కుమార్, జాతీయ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి ధన్య వాణి, మరియు సభ్యులు పాల్గొన్నారు. ఈ నియామకం పట్ల హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు, మరియు ఆర్టీఐ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments